రేపు రాష్ట్ర అవతరణ వేడుకలు: ఎమ్మార్వో

69చూసినవారు
రేపు రాష్ట్ర అవతరణ వేడుకలు: ఎమ్మార్వో
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఉదయం 8: 30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు ధర్మారం ఎమ్మార్వో అంబటి రజిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ కోరారు.

సంబంధిత పోస్ట్