బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

62చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎక్కడికి వెళ్లినా వారికి సమాచారం వెళ్తుందన్నారు కౌశిక్‌రెడ్డి. తమ పర్సనల్ విషయాలు ఎలా బయటికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. అలాగే కరీంనగర్ సీపీ ఫోన్‌నే ట్యాపింగ్ చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్