ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి చంద్ర రథోత్సవం భక్తుల జయ జయ ధ్వనుల మధ్య మాడవీధులలో సోమవారం కన్నులపండువగా ఊరేగించారు. చంద్ర రథాన్ని లాగడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రథాన్ని లాగుతూ జైశ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడుతూ ముందుకు సాగారు. రథం ముందు ఒగ్గు కళాకారులు డప్పు వాయిద్యాలతో అలరించారు.