హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో శిధిలమైన గుడిని గొల్ల, కురుమలు నిర్మించారు. కానీ, కురుమ కులస్తులు తాము జాతర నిర్వహించలేమని గొల్ల కులస్తులే నిర్వహించాలని తెలపగా వారు జాతరకు సిద్ధమవుతుండగా కురుమ కులస్తులు గుడికి తాళం వేయడంతో ఇరు కులస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన గొల్ల కులస్తులు పోలీసులను ఆశ్రయించగా వారు కూడా కురుమ కులస్తుల వైపు మాట్లాడుతున్నారని గొల్ల కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.