హుజురాబాద్ పట్టణంలో గల ఆరె మరాఠీల ఆరాద్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా బుధవారం భూసారపువాడలోని ఆరె కుల బాంధవులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదనంతరం కేకు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఆరె వంశీయులు మాట్లాడుతూ శివాజీ ధైర్యశాలి, పరాక్రమవంతుడు, హిందూ సామ్రాజ్యంను స్థాపించిన యోధుడు అని కొనియాడారు. జై భవాని వీర శివాజీ అనే నినాదాలతో వేడుకలు మారుమ్రోగినవి.