హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కు సత్కారం

5చూసినవారు
హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కు సత్కారం
తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ సంఘ భవనానికి హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య శనివారం విచ్చేసారు. మున్సిపల్ పరిధిలో వారు చేసిన సేవా కార్యక్రమాలకు గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ కమిషనర్ గా అభినందన అందుకున్న సందర్భంగా వారికి సంఘ అధ్యక్షులు ఉస్మాన్ పాషా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ భాష, కోశాధికారి కే దుర్గాజీ, ప్రచార కార్యదర్శి జనార్ధన్, ఉద్యోగులు పాల్గొన్నారు.