హుజురాబాద్: కవయిత్రి మొల్లమాంబ జయంతి

84చూసినవారు
హుజురాబాద్: కవయిత్రి మొల్లమాంబ జయంతి
హుజురాబాద్ పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో గల చౌరస్తా నందుగల రచయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి కుమ్మరి కులస్తులు గురువారం కొబ్బరికాయలు కొట్టి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘ నాయకులు పాల్గొని ప్రసంగించారు. మొల్ల మాంబ రామాయణంలో తనదైన శైలిలో సామాన్యులకు అర్థం అయ్యే రీతిలో తెలుగు భాషలో రచించటం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్