హూరాబాద్ ప్రజలను హైడ్రా పేరిట ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సోమవారం మాస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు ఎవరైనా ప్రజలకు నోటీసులు ఇస్తే తనకు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తిరిగి మరో నాలుగు ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కౌశిక్ రెడ్డి ఉద్ఘాటించారు.