ఇల్లందకుంట శ్రీ సీతరామచంద్ర స్వామి ఆలయంతో 25 ఏళ్లుగా అనుబంధం ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయానికి లక్షలాది మంది వస్తూ ఉంటారని, గతంలో కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారని తెలిపారు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయ అభివృద్ధి విషయంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.