జమ్మికుంట పట్టణంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో వసంత పంచమి సంధర్భంగా ప్రధానాచార్యుల ఆధ్యర్యంలో పండితులు వర ప్రసాద్ శర్మ పాఠశాల ఆవరణలో సరస్వతి మాతకు పూజలు మరియు ప్రత్యేక హోమం నిర్వహించారు. తదనంతరం సుమారు వందమంది చిన్నారులకు అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో వసంత పంచమి సంధర్భంగా చిన్నారులకు పలక బలపం పంపిణీ చేశారు.