కరీంనగర్ పట్టణంలోని కోతి రాంపూర్ లో గల ప్రభుత్వం ఉన్నత పాఠశాలకు చెందిన 2004 - 2005 సంవత్సరానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించారు. మొదటగా పాఠశాల ఆవరణలో వేదిక వద్ద గల సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.