ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిగ్రీ పాసైన అభ్యర్థులకు సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ కు ఉచిత శిక్షణ కోసం బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు శనివారం సూచించారు. ఈ నెల 16 నుండి జూలై 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఆన్లైన్ పరీక్షలో ఎంపికైన వారికి జూలై 25 నుండి వచ్చే సంవత్సరం జూలై 30 వరకు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల వారు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040-24071178 నంబర్ లో సంప్రదించాలన్నారు.