ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ కు రానున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో పర్యటన ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేస్తారు. అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం ఇక్కడ బస చేస్తారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.