ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు

1062చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం వీణవంక లోని ప్రభుత్వ పాఠశాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భార్య శాలిని తోపాటు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు సాయినాథరెడ్డి, శైలజ సోదరుడు కార్తీక్ రెడ్డి, సంతోషిని దంపతులు ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్