కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ఆరా తీశారు. నెంబర్ కేటాయించిన ప్రతి ఇంటి వద్ద ఖచ్చితమైన సమాచారం నమోదు చేయాలని అధికారులకు తెలిపారు.