హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వల్భాపూర్ గ్రామానికి చెందిన ఎక్కటి రఘుపాల్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు కరీనంగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రఘుపాల్ రెడ్డిని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదివారం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.