గత నెల 8న సైదాపూర్ మండలం గొల్లగూడెంకు చెందిన మహేందర్ తన బైక్ పై ఇంటికి వెళ్తుండగా పోలీసులు అతనిని వాహన తనిఖీలో భాగంగా ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్సైగా పని చేసిన భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాష్, అజయ్ లకు మహేందర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. తనను శిక్షణ ఎస్సై, కానిస్టేబుళ్లు కులం పేరుతో దూషించారని బాధితుడు మహేందర్ సోమవారం పోలీసులకు తెలపడంతో, వారు ఎస్సి, ఎస్టీ కేసు నమోదు చేశారు.