ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యయుతమైన హక్కు అని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. సోమవారం హుజురాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆయన తన సతీమణి సుధాశ్రీ తో పాటు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వకుళాభరణం మాట్లాడారు. ప్రజాస్వామ్యం పరిపుష్టంగా వర్ధిల్లాలి అంటే ఓటు హక్కును సద్వినియోగం చేయడం ప్రజలందరి కనీస కర్తవ్యం అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ మహోన్నతమైనది ఓటును సద్వినియోగపరచుకొని పౌరులుగా తమ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం అనివార్యమైనది అన్నారు.