గత కొద్దిరోజుల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో గుండెపోటుతో మరణించిన ఆకునూరి రాకేష్ కుటుంబానికి అంబేద్కర్ సంఘం నాయకులు అనిల్, ఉపేందర్ 50 కిలోల బియ్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గూడెం మొగిలి 25 కేజీల బియ్యం ఆదివారం అందించారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు.