కరీంనగర్: సంక్షేమ హాస్టళ్లకు, రెసిడెన్షియల్ పాఠశాలలు, చౌక ధరల దుకాణాలకు సన్నరకం బియ్యం అందిస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన బుదవారం మాట్లాడుతూ మొత్తం 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం అవసరం ఉంటుందని, ధాన్యం సేకరణ తక్కువ కాకుండా చూడాలని సూచించారు. సన్న రకాల వడ్ల కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు.