టమాట కూర తింటే గుండె ఆరోగ్యానికి మేలు
టమాట కూర తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టమాటాలో విటమిన్ సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా ఉన్నాయి. టమాటలో పొటాషియం ఎక్కువగా ఉండటంవల్ల రక్తపోటు పెరగదు. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువసేపు ఆకలి కానివ్వదు. ఇంకా దీనిలో ఉండే బీటాకెరోటిన్.. ప్రొస్టేట్ క్యాన్సర్ కణితిని పెరగకుండా నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.