వీణవంక మండలం నరసింహులపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన వంతడుపుల అజయ్ గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి ముద్దసాని శ్రీనివాస్, సభ్యులు గంధం సుమన్ లు మంగళవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.