హుజురాబాద్ నియోజకవర్గ దళిత బంధు రెండో విడతకు ప్రభుత్వ నిర్ణయంపై వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ దళితుల పక్షాన నిలబడి ప్రత్యేక చొరవచూపడం వల్లే సాధ్యమైందని ఆయనకు మండల కాంగ్రెస్ నాయకులు జీడి తిరుపతి, అందే కుమార్, అంబాల రాజేష్, ఖండే మహేందర్, జీడి కుమారస్వామి, దాసరపు పరమేష్, గుండేటి సుధాకర్, ఎలకపల్లి శివ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.