ఓటు హక్కు వినియోగించుకున్న వొడితల ప్రణవ్

65చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న వొడితల ప్రణవ్
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చేసింది. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్