ఆర్థిక సమస్యలు తట్టుకోలేక పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వీణవంక మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా. రేపాల ప్రశాంత్ (27) కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా సోమవారం పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, బుధవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రైనీ ఎస్సై తెలిపారు.