రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్ట వద్దు: కమలాపూర్ సీఐ హరికృష్ణ
రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టకూడదని కమలాపూర్ సీఐ హరికృష్ణ రైతులకు బుధవారం సూచించారు. హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై, గూడూరు హనుమకొండ, శంభునిపల్లి రహదారులపై రైతులు ధాన్యాన్ని పోయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని.. ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని రైతులు సహకరించాలని కోరారు. వినకుండా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.