దసరాలోగా రుణమాఫీ చేయాలి: ఎమ్మెల్యే కౌశిక్
దసరాలోగా రైతు రుణ మాఫీ చేయాలని రెండో విడత దళిత బంధు ఇవ్వాలని. లేనిచో నియోజకవర్గంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విలేకరుల సమావేశంలో గురువారం అన్నారు. స్థానిక కల్వల ప్రాజెక్టు నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంచనాలు పంపామని వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, నాయకులు బండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.