యువకుని దారుణ హత్య

81చూసినవారు
యువకుని దారుణ హత్య
జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో దారుణం జరిగింది. మంగళవారం రాత్రి అన్న విద్యాసాగర్ (32) పై తమ్ముడు విక్రమ్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం గ్రామం నుండి పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్