కొండగట్టులో 500 మొక్కలు నాటిన మెకానిక్

67చూసినవారు
కొండగట్టులో 500 మొక్కలు నాటిన మెకానిక్
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ నుంచి గుట్ట మీద వరకు శనివారం హుస్నాబాద్ కు చెందిన సత్యనారాయణ అనే సామాజిక సేవకుడు 500 మొక్కలను తన సొంత ఖర్చుతో నాటాడు. ప్రస్తుతం సత్యనారాయణ కరీంనగర్ వర్క్ షాప్ సమీపంలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. గతంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం, శాతవాహన యూనివర్సిటీ, రైల్వే స్టేషన్ , కోర్టు , స్మశాన వాటిక ఆవరణలో సుమారు 70 వేల మొక్కలు సొంత డబ్బులతో నాటానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్