బార్ అండ్ రెస్టారెంట్ తరలించాలని ప్రజావాణి లో వినతి

50చూసినవారు
జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో గల బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ ను అక్కడి నుండి తరలించాలని ఆ కాలనీ వాసులు సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐడివోసిలో నిర్వహించిన ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం సేవించి నా నా హంగామా సృష్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నివాసాల మధ్యలో ఉన్న ఈ బార్ అండ్ రెస్టారెంట్ ను ఇక్కడి నుండి తొలగించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్