వయోవృద్ధులైన కన్న తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదేనని, విస్మరిస్తే వయోవృద్ధుల చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కౌన్సెలింగ్ కేంద్రంలో సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కౌన్సెలింగ్ నిర్వహించారు.