రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొందరు కావాలనే రైతు రుణమాఫీపై రాజకీయం చేస్తున్నారని, అర్హులైన రైతులు అందరికి రుణమాఫీ అవుతుందన్నారు. మండలస్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, రైతులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని చెప్పారు.