ధాన్యం తరుగు తీయకుండా త్వరగా తరలించాలని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం బీర్పూరు మండల కేంద్రంలో మోతీ నగర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, అకాల వర్షాలకు తడిసిన ధాన్యంను పరిశీలించారు. వారి వెంట కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, నాయకులు మహిపాల్ రెడ్డి, హరీష్, సుమన్, సుధాకర్, నరేందర్, మండల ఉప అధ్యక్షులు శ్రీనివాస్ రావు ఉన్నారు.