జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు పై మంగళవారం ప్రమాదం జరిగింది. కొండగట్టు అంజన్న ను దర్శనం చేసుకుని ఘాట్ రోడ్డు ద్వారా బైక్ పై దిగువకు వస్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో రాయికల్ మండలం తాట్లవాయి కి చెందిన వినోద్ శ్రీ వాణి దంపతులతో పాటు వారి 4 సంవత్సరాల పాప వేదాంశిక గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు