జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

53చూసినవారు
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
మల్యాల మండలంలోని నూకపల్లి, రామన్నపేట, మల్యాల, కొడిమ్యాల మండలం పూడూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత బుధవారం సందర్శించారు. తూకం యంత్రాలు, తేమ యంత్రాల పనితీరును పరిశీలించారు. కల్లాల వద్ద సన్నాలు, దొడ్డు రకం ధాన్యాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలని సూచించారు.
.

సంబంధిత పోస్ట్