

బాలుడికి సిగరెట్ ఎలా తాగాలో నేర్పిస్తున్న వైద్యుడు (వీడియో)
ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 3 ఏళ్ల బాలుడికి సిగరెట్ ఎలా తాగాలో నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే వీడియోలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ వైద్యుడిగా తెలుస్తోంది. కానీ బాలుడికి ఎందుకు అలా తాగించాడో అనే విషయం మాత్రం తెలియట్లేదు. ప్రస్తుతానికి ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.