రాయికల్ మండలంకు చెందిన జైత భీమయ్య(66) అనే వృద్ధుడు ఒక బాలికపై అత్యాచారం చేసిన విషయం విదితమే. అప్పటి డిఎస్పీ వెంకటరమణ,సీఐ రాజేష్ కేసు దర్యాప్తు చేయగా, ఎస్సై శ్రీకాంత్, మిగతా సిబ్బంది సాక్ష్యాధారాలు సంపాదించి కోర్టులో సమర్పించగా, నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న ప్రభావతి నిందితుడికి జీవిత ఖైదు, రూ 17 వేల జరిమానా విధించారు. అంతేకాక సదరు బాలికకు రూ 3 లక్షలు పరిహారం చెల్లించాలని మంగళవారం తీర్పు ఇచ్చారు. అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.