జగిత్యాల రూరల్ మండలం తక్కళ్ళపెల్లి గ్రామ సరిహద్దులో జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుదురుగా రెండు బైకులు ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ కు చెందిన అరవింద్, బత్తుల సాయి అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తుండగా మేడిపెల్లి మండలం కొండాపూర్ కు చెందిన వంశీ మృతి చెందాడు.