జగిత్యాల: పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ

59చూసినవారు
జగిత్యాల: పాత్రికేయుల సంఘీభావ ర్యాలీ
భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు చేస్తున్న వీరోచిత పోరాటానికి మద్దతుగా జగిత్యాల పాత్రికేయులు శనివారం సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని జిల్లా కేంద్రంలోని తాహశీల్దార్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్