జగిత్యాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

81చూసినవారు
జగిత్యాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన బండారి లక్ష్మణ్ బుధవారం తన పొలానికి నీరు పెట్టడానికి బావి దగ్గరకు వెళ్లగా, బావి గోడ కూలి ప్రమాదవశాత్తు లక్ష్మణ్ కాలు జారి బావిలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిర్రా సతీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్