జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శ్రీ జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతి ఆలయం 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సరస్వతీ దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి వేణుగోపాలరావు, బండారి దివాకర్ రావు, ఎలిమిళ్ళ సత్తయ్య, గంప రాములు, కృష్ణ రావు, చకినం ప్రసాద్, దామోదర్ రావు, రంగు మహేష్, ములసపు మహేష్ పాల్గొన్నారు.