జగిత్యాల జిల్లాకేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఆదివారం శ్రీ సూర్య భగవానుకి, ప్రత్యేక పూజలలో భాగంగా సత్సంగం, ఆదిత్య హృదయo, భగవత్ గీత శ్లోకాలు పటించడం, అనంతరం ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ వడ్లగట్ట రాజన్న, ఆర్గనైజిoగ్ సెక్రటరీ వొడ్నాల శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు గట్టు రాజేందర్, గౌరవ అధ్యక్షులు నాయిని విద్యా సాగర్ -లత, ధర్మకర్త భారతాల రాజ సాగర్ పాల్గొన్నారు.