జగిత్యాల: ఆసుపత్రి ఎదుట పోచంపేట వాసుల ఆందోళన

61చూసినవారు
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత గంగాధర్ భార్య రాజవ్వ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భసంచి ఆపరేషన్ కోసం గురువారం అడ్మిట్ అయ్యింది. అయితే ఆపరేషన్ వికటించి రాజవ్వ మృతి చెందింది. వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా రాజవ్వ మృతి చెందిందని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యురాలిపై తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్