జగిత్యాల: స్మశాన వాటికకు స్థలం కోసం ఎమ్మెల్యేకు వినతి

65చూసినవారు
జగిత్యాల: స్మశాన వాటికకు స్థలం కోసం ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు మంగళవారం కలెక్టరేట్ లో కలిశారు. నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి స్మశానవాటికకు స్థలం కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ధాత్రిక నరేందర్, రామగిరి రమేష్, బొల్లారం స్వామి, విజయ, ఖలీల్, శ్రీను, పద్మ, అజార్, రవికుమార్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్