జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జిల్లా స్వచ్ఛ భారత ఔట్ సోర్సింగ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం కలిశారు. తమ నెల వారి చెల్లించే జీతం 20 వేలకు బదులు 16 వేలు చెల్లించారని ఇట్టి సమస్యను పరిష్కరించి తమ జీతాన్ని యథావిధిగా చెల్లించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే అధికారులతో చర్చిస్తా అన్నారు.