జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర పండుగ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో లైటింగ్, చలువ పందిళ్లు, మొరం, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పంబాల రాము పాల్గొన్నారు.