జగిత్యాల: స్నేహితురాళ్లు అవమానించారని విద్యార్థి సూసైడ్

244చూసినవారు
జగిత్యాల: స్నేహితురాళ్లు అవమానించారని విద్యార్థి సూసైడ్
జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో విషాద ఘటన జరిగింది. అక్కడి కి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని శాటిపల్లి సత్య, హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. చదువులో వెనుకబడిందంటూ స్నేహితులు వైష్ణవి, సంజన అవమానించడంతో, నిత్య ఈ నెల 3న ఇంటికి వెళ్లి గడ్డి మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్