
వైసీపీ హయాంలో కంపెనీలు పారిపోయాయి: మంత్రి పార్థసారథి
అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా ముందుకు తీసుకెళ్తున్నామని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీలను ఈ ఏడాది 80శాతం వరకు పూర్తి చేశామన్నారు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ' గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికొదిలేసింది. రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేకపోయారు. ఉన్న సంస్థలే రాష్ట్రంలో ఉండలేమని పారిపోయాయి' అని మంత్రి విమర్శించారు.