జగిత్యాల పట్టణంలోని లింగంపేటలో గురువారం యువకుల మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. అంతర్గంకు చెందిన అరవింద్, వంశీ, గంగాధర్ లపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయాల పాలైన యువకులను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో గంగాధర్ అనే యువకుడికి 25కి పైగా కత్తిపోట్లు పడడం తో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.