
మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉంది: పవన్
AP: చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు. తన కొడుకు కోలుకోవాలని ప్రార్థనలు చేసిన జనసేన కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులు, సినీ, రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్.. చికిత్స అనంతరం నిన్న హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.